ఆంధ్ర ప్రదేశ్
Cyclone Montha: అంతర్వేదిలో ఇసుక తుఫాన్

Cyclone Montha: కోనసీమ జిల్లాలోని కరవాక నుండి అంతర్వేది వరకు భారీ గాలి వీస్తుండటంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఇసుక తుఫాన్ ఉరకలేస్తోంది. తీరం దాటిన తుఫాన్ ఎఫెక్ట్‌తో కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లవపాలెం గ్రామంలో అర్ధరాత్రి అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పర్యటించారు. తుఫాన్ ప్రభావం సదరు గ్రామంలో తీవ్రంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంటకు అమలాపురం నుండి బయలుదేరి అంతర్వేది పల్లవపాలెం చేరుకున్నారు.



