Single Trailer : శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ రిలీజ్

Single Trailer: శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘సింగిల్’ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే.. ఇది పక్కా కామెడీ ఎంటర్టైనర్ అని ఒక్క లైన్లో చెప్పొచ్చు. ట్రైలర్లో శ్రీవిష్ణు మార్క్ కామెడీ, డైలాగ్ డెలివరీ సూపర్బ్‌గా ఆకట్టుకుంటున్నాయి.
‘సింగిల్’ ట్రైలర్ ఒక ఫన్‌ఫుల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని హైలైట్ చేస్తుంది. శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యాడు. ఇక వెన్నెల కిషోర్‌తో కలిసి శ్రీవిష్ణు చేసే హంగామా థియేటర్లలో ఫన్ రైడ్‌ను గ్యారంటీ చేస్తుంది.
ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. గీతా ఆర్ట్స్, కల్యా ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం మే 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా యూత్‌ని ఎంటర్టైన్ చేయడం పక్కా అనిపిస్తోంది.