Coolie: రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్!

Coolie: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే సమయం ఉందని మేకర్స్ ఓ స్టైలిష్ వీడియోతో ప్రకటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో రజినీ ఫ్యాన్స్‌ను మళ్లీ థియేటర్లలో ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నారు.
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రూపొందించిన ‘కూలీ’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. తాజాగా విడుదలైన రిలీజ్ అప్డేట్ వీడియోలో వింటేజ్ షాట్స్, రజినీ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రజినీకాంత్ మార్క్ యాక్షన్, లోకేశ్ సినిమాటిక్ టచ్‌తో ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. 100 రోజుల కౌంట్‌డౌన్ స్టార్ట్ కాగా, ఫ్యాన్స్ ఇప్పటి నుంచే థియేటర్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. మరి, ఈ సినిమాతో రజినీ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.