సినిమా

Kishkindapuri: బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి ప్రీమియర్ టాక్..

Kishkindhapuri: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన కొత్త సినిమా “కిష్కింధపురి” ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా ప్రీమియర్ షో హైదరాబాద్‌లోని AAA మల్టీప్లెక్స్ లో జరుగ్గా ప్రేక్షకులు మంచి టాక్ ఇస్తున్నారు. మొదట్లో కథలోకి నెట్టుకోవడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ, తరువాత భయభరితమైన ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. మొదటి భాగం హంగులు లేకుండా, క్లియర్‌గా, నేరుగా చెప్పడమే ప్రత్యేకత. రెండో భాగంలో కూడా హారర్ సీన్‌లు చాలా గ్రిప్పింగ్‌గా, ఇంకా ఎక్కడా తక్కువ కాకుండా రికార్డ్ చేస్తున్నారు.

తమిళ్ నటుడు శాండ నటన ప్రేక్షకులకు గూస్ బమ్స్ ఇవ్వటమే కాకుండా, అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్‌లో ఇచ్చిన ప్రదర్శన చాలానే ప్రశంసనీయంగా చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఎం.ఆర్. రాజా కృష్ణన్ అందించిన సౌండింగ్ చాలా మెప్పిస్తోంది. హారర్ సినిమాకు సౌండ్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అలా ఈ సినిమా సౌండ్ మేకింగ్ చాలా జోష్ గా ఉంది.

మొత్తం మీద, “కిష్కింధపురి” సినిమా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టి భయపడేలా చేస్తూ, సరైన థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది. ఇంకా చివర్లో ఇచ్చిన చిన్న ట్విస్ట్ పార్ట్ 2 కోసం సరికొత్త ఎక్సైట్‌మెంట్ ను పెంచుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button