వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొండా ఫ్యామిలీ

కొండ దంపతులను ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారా బీసీ మహిళ కు చెందిన మంత్రిత్వ శాఖలో రెడ్డిల పెత్తనాన్ని ఎదిరించినందుకే ఇబ్బందులా. ఒకపక్క కొండ సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక్క బీసీ మహిళా మంత్రిని తొలగిస్తే బీసీల స్పందన ఏ విధంగా ఉండబోతుంది. జరుగుతున్న పరిణామాలు బలహీన వర్గాలకు చెందిన మహిళపై జరుగుతున్న వివక్షను నిలదీసినందుకా లేదా తొందరపాటు నోటి దులతో వచ్చిన కష్టాల కొండా సురేఖ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏ విధంగా ఉండబోతుంది సుమంత్ అనే వ్యక్తి ఓఎస్డీ గా చేసిన నిర్వాకాల కారణంగా ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది.
అదే సమయంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించారంటూ ఫిర్యాదు రావడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సుమంత్ ను స్వయంగా రక్షించి తనతో పాటు తీసుకెళ్లారు కొండా సురేఖ. ఆమె కుమార్తె సీఎంతో పాటు పలువురు తన తల్లిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించేశారు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం కనిపించడంలేదు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సంక్షోభం ముందు నిలిచింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం ముదిరి పాకాన పడింది. మొదటినుంచి వస్తున్న వివాదాలపై అధిష్టానం అలసత్వం వహించడమే కాంగ్రెస్ పార్టీలో ఉప్పెనకు దారితీసిందా. కొండా దంపతులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకులు ఎందుకు వారికి శత్రువులు అవుతున్నారు.ఎందుకు కొండా కుటుంబం వారికీ టార్గెట్ అవుతుంది. మొదటినుంచి కొండా దంపతులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.
సొంత పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తుండటంతో వివాదాల్లో నిలుస్తున్నారు. పలుమార్లు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా వివాదాలను కట్టడి చేయడంలో వారు చర్యలు తీసుకున్న దాఖలాలు పెద్దగా కనిపించలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతోపాటు జిల్లా అధ్యక్షులతో కూడా దూరంగా ఉంటున్నారు. వీరి మధ్య పంచాయతీని ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో అధిష్టానం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు.
ఇంకోపక్క చూస్తే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే కొండ దంపతులు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా అంటే నిజమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్న వీరు ఇలాంటి వ్యవహార శైలితోని పార్టీకి దూరమై కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు . అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది.
అయితే కొండా అనాలోచిత వ్యాఖ్యలతో పార్టీని అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా , వారి వ్యవహార శైలితో పార్టీ పెద్దలకు కూడా విసుగుచెందే విధంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాపోతున్నారు. ఏకంగా మరో సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మేడారం అభివృద్ధిపనులకు సంబంధించిన కాంట్రాక్టర్ విషయంలో వివాదాలు రాజుకోవటం కలకలం సృష్టించింది. మరోవైపు కొండా సురేఖ దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ పైనా ఆరోపణలు రావడంతో ప్రభుత్వంతోపాటు , కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ వ్యవహారం కొన్నాళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఆమె వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ దేవాదాయ, అటవీ శాఖలతో సంబంధం ఉన్న వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. డెక్కన్ సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించినట్లుగా చెబుతున్నారు. చివరికి మేడారం పనుల కాంట్రాక్టర్ ను కూడా బెదిరించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దల్లో ఒక్కసారిగా ఆగ్రహం వచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తీసేయమని ఆదేశించారు.
ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రయత్నించారు. అయితే సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత షాక్ ఇచ్చారు. సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విపక్ష పార్టీ నేతల్లా తన తల్లి, తండ్రిపై సీఎంతో పాటు ముఖ్యనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలం అయిన తమను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.
స్వయంగా ముఖ్యమంత్రి తమపై కుట్ర చేస్తున్నారని ఓ మంత్రి ఆరోపించడం చిన్న విషయం కాదు. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రి వర్గంలో ఉండలేరు . ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉంది. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం లేదా ఆమెనే రాజీనామా చేయడం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతేకాకుండా రెడ్డిలంతా కలిసి బీసీలను ఎదగకుండా చేయాలని కుట్ర చేస్తున్నారనే ఆరోపణలతో కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు బీసీలకు అవకాశం ఇస్తామంటున్నా బిజెపి వైపు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి. కొండా దంపతుల ఎపిసోడ్ కి సుఖాంతమైన ముగింపు పడుతుందా కాంగ్రెస్ పార్టీలోని ఈ అలజడిని ఏఐసిసి పెద్దలు ఏ విధంగా చల్లార్చే దిశగా ముందుకు వెళ్తారో వేచి చూడాలి మరి.



