సినిమా
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ సమయంలో తమిళ హీరో అజిత్, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీ దంపతులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రంగనాయకుల మండపలంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రాంతో సత్కరించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక స్వామివారి దర్శనానికి వచ్చిన అజిత్‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు స్థానికులు



