వేములవాడ బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాజన్నను దర్శించుకున్న అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అనవాయితీ. ఈ క్రమంలోనే భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు వేలాదిగా తరలివచ్చిన భక్తులను నియంత్రించడం, సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి బోనాలతో తరలివచ్చి గంటల కొద్ది క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ అమ్మవారి దర్శన భాగ్యం కలగడం లేదు.
చివరకు బయట నుండే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు కొందరు. మరికొందరు మొక్కులు చెల్లించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. వీఐపీ, ప్రముఖుల దర్శనాలపై చూపిన చొరవ ఆలయ అధికారులు సామాన్య భక్తుల సౌకర్యాలపై చూపలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



