తెలంగాణ
నేడు సూర్యాపేట జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఇవాళ సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి.
తిరుమలగిరి సభను అడ్డుకుంటారని గులాబీ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కాగా ఇప్పటికే సూ ర్యాపేట, తుంగతుర్తి, హుజూర్ నగర్‌తోపాటు కోదాడ ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులు జరుగుతున్నాయి.



