వ్యాపారం
Google: గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు..

Google: టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. క్లౌడ్ డివిజన్లోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందని తెలుస్తోంది. సంబంధిత వ్యక్తులు ఈవిషయాన్ని వెల్లడించినట్లు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో వెల్లడించింది. అయితే.. ఎంతమందిని తొలగించిందనే విషయం మాత్రం తెలియరాలేదు.
వంద మందికి పైగా ఉండొచ్చని, అది కూడా కొన్ని టీమ్స్‌పై మాత్రమే తొలగింపుల ప్రభావం ఉందని తెలుస్తోంది. కంపెనీ దీర్ఘకాలిక విజయాల కోసం వ్యాపారానికి కీలకమైన రంగాల్లో పెట్టుబడులు పెంచేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అందులో భాగంగా.. కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్పారు.