ఆంధ్ర ప్రదేశ్
Road Accident: బైక్‌ను ఢీకొట్టిన ఇన్నొవా.. ఒకరు మృతి

Road Accident: చిత్తూరు జిల్లా పుత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహాన్ని ఇన్నోవా వాహనం ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలీకి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గుడిపాల మండలం గుండ్లూరు గ్రామానికి చెందిన వీరమ్మగా గుర్తించారు.



