సినిమా

HIT3: హిట్ 3’ బాక్సాఫీస్ సంచలనం.. రెండు రోజుల్లో రికార్డులు

HIT3: నాని నటించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రెండు రోజుల్లో ఎన్నో రికార్డులు సాధించిన ఈ చిత్రం, వీకెండ్‌లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా ఉంది. వివరాలు చూద్దాం.

‘హిట్ 3’ సినిమా మొదటి రోజు వరల్డ్‌వైడ్‌గా 40 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి దూసుకెళ్లింది. రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ, సాలిడ్ కలెక్షన్స్‌తో 20 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. దీంతో రెండు రోజుల్లో మొత్తం 62 కోట్లకు పైగా గ్రాస్‌ను మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

మూడో రోజు కూడా భారీ బుకింగ్స్ నమోదవుతుండగా, ఈ శనివారం, ఆదివారం వీకెండ్‌లో డబుల్ డిజిట్ కలెక్షన్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాని నటన, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ విజయంతో ‘హిట్’ ఫ్రాంచైజీ మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button