Raj Kasireddy: హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి నివాసంలో సోదాలు

Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డికి చెందిన ఆఫీసుల్లో కూడా అర్ధరాత్రి వరకు అధికారులు సోదాలు జరిపారు. సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు లిక్కర్ స్కాంపై విచారణ కొనసాగిస్తున్నాయి.
కొంతకాలంగా రాజ్ కసిరెడ్డి ఎవరికీ అందుబాటులో లేరు. దీంతో రంగంలోకి దిగిన సిట్.. లిక్కర్ స్కాంలో వసూళ్ల నెట్వర్క్, నగదు మళ్లింపుపై ప్రధానంగా విచారణ కొనసాగిస్తున్నారు. అ దే విధంగా డబ్బు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు. ఎవరికి ఇచ్చారనే అంశంపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.
ముఖ్యంగా రాజ్ కసిరెడ్డియే కింగ్ పిన్ అని భావిస్తోంది సిట్. ఇక మూడు సార్లు నోటీసులు ఇచ్చినా రాజ్ కసిరెడ్డి స్పందించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోడం లేదని తెలిపారు. దీంతో రాజ్ కసిరెడ్డి తీరుపై కోర్టుకు వెళ్తామంటున్నారు సిట్ అధికారులు.