Prabhas: 3 రోజుల్లో 25 కోట్లు ఆఫర్.. తిరస్కరించిన ప్రభాస్

Prabhas: ప్రభాస్ గురించి ఓ హాట్ టాపిక్ వినిపిస్తుంది. రూ.25 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రభాస్ తిరస్కరించాడట ఏంటి స్టోరీ? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు చెబితే చాలు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌లో జోష్ మామూలుగా ఉండదు. టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆయనతో పనిచేయడానికి క్యూలో ఉన్నారు. కానీ, ప్రభాస్ మాత్రం ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టులతో సూపర్ బిజీగా ఉన్నారు.
ఇలాంటి టైమ్‌లో ఓ బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్ కోసం ఆయనకు రూ.25 కోట్ల ఆఫర్ వచ్చిందట. కేవలం మూడు రోజుల షూట్‌కే ఈ భారీ మొత్తం ఆఫర్ చేశారు. కానీ, ప్రభాస్ సింపుల్‌గా ‘నో’ చెప్పేశాడు. ఇండస్ట్రీలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం తన సినిమా షెడ్యూల్‌పైనే ఫోకస్ చేస్తున్నాడు. గతంలోనూ ఇలాంటి ఆఫర్లను ఆయన తిరస్కరించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయం ఫ్యాన్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.