జాతియం
భారత్‌కు చేరుకున్న లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా

Tahawwur Rana: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణా భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని రీజియన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారికంగా అరెస్టు చేసింది.
అనంతరం ఎన్ఐఏ కోర్టుకు తరలించనున్నారు. అక్కడే ఎన్ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తీహార్ జైలుకు తరలిస్తారా? లేదంటే మరోచోట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.