ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. కంకిపాడు పీఎస్కు వంశీ తరలించగా ప్రస్తుతం లాయర్ సమక్షంలో వంశీని విచారిస్తున్నారు హనుమాన్ జంక్షన్ సర్కిల్ సీఐ సత్యనారాయణ. కాగా కస్టడీకి తీసుకునే ముందే వంశీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో శ్రీధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. విచారించిన ధర్మాసనం ఒక్కరోజు కస్టడీకి అనుమతిచ్చింది గన్నవరం కోర్టు. ఇక ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. ఏప్రిల్-9 వరకు రిమాండ్ విధించింది కోర్టు.