Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ కారును వెనక నుంచి ఢీ కొట్టిన బస్సు

Aishwarya Rai: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్‌కు చెందిన కారును బుధవారం మధ్యాహ్నం జుహులోని ఆమె నివాసం సమీపంలో ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడిపోయారు.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, కారుకు కూడా నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే, ఘటన సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. స్థానికుల ప్రకారం, ఈ కారు ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ది అని చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనిలో బస్సు కారును ఢీకొట్టిన దృశ్యం కనిపిస్తోంది.
ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బాడీగార్డ్‌లు ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసినట్లు సమాచారం. ఐశ్వర్యా ఆ సమయంలో కారులో లేనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.