Prakash Raj: బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై స్పందించారు. తన పేరు ప్రస్తుతం చర్చకు వస్తుండటంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేశారు. గతంలో తాను ఓ గేమింగ్ యాప్ యాడ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. అయితే, ఆ ప్రకటనను చేయడం తప్పుడు నిర్ణయమని తెలుసుకుని, తానే స్వయంగా ఒప్పందాన్ని పొడిగించకుండా నిష్క్రమించానని స్పష్టం చేశారు. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశానని అన్నారు.
ఇప్పుడు ఏ గేమింగ్ యాప్ లకు ప్రచారకర్తగా పనిచేయడం లేదని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపానని తెలిపారు. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదన్నారు. తాను చేసిన యాడ్ పై పోలీసులకు వివరణ ఇస్తానని నటుడు ప్రకాశ్ రాజ్ వివరణ ఇచ్చారు.