ఆంధ్ర ప్రదేశ్

Balineni Srinivasa Reddy: బాలినేని ఆవేశపడ్డారా? నిజంగా అంత సీన్ ఉందా?

Balineni Srinivasa reddy: ప్రకాశం జిల్లాలో జడ్పీ టార్గెట్‌గా చైర్ గేమ్ మొదలైంది. తమ నాయకుడి ఆదేశిస్తే.. జడ్పీ పీఠాన్ని పెడతానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. పోనీ ఆ కీలకనేత తమాషాగా మాట్లడే వ్యక్తా అంటే అది కాదు ఆయన అన్నాడంటే పగ పట్టిన పాము కన్నా డేంజరనే చెప్పాలి. ఇంతకు బాలినేని అన్నంతపని చేస్తారా..? అసలు జెడ్పీలో ఒక్క సీటు కూడా లేని పార్టీకి జడ్పీ పీఠం ఎలా దక్కుతుంది..? మాజీ మంత్రి మాటల వెనుక అసలు అంతర్యమేంటి..?

పక్కా ప్లాన్‌తో ఉన్నారా..? ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అన్నారా..? జనసేన ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధినేత ఆదేశిస్తే ప్రకాశం జిల్లా జెడ్పీ పీఠాన్ని జనసేన చేతిలో పెడతానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతుండగా జడ్పీలో ఒక్కసీటు లేని జనసేనకు జడ్పీ చైర్ ఎలా దక్కుతుందన్న చర్చ జిల్లా రాజకీయ వార్గాల్లో మొదలైంది.

ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మపర్సన్‌గా వైసీపీ బూచేపల్లి వెంకాయమ్మ కొనసాగుతున్నారు. కాగా.. ప్రకాశం జిల్లా పరిషత్‌లో మొత్తం 55 మంది సభ్యులుంటే వారిలో ముగ్గురు ఇప్పటికే మృతి చెందారు. ఎన్నికల ముందు నలుగురు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. అయినప్పటి వైసీపీకి ఇంకా 48 మంది సభ్యులున్నారు. వీరందరిని వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమన్వయం చేసుకుంటున్నారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లినప్పటి నుంచి వైసీపీ అధిష్టానం అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది. జిల్లాలో వైసీపీ క్యాడర్ బాలినేని వెంట వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైసీపీలోని బాలినేని అనుచరులు ముద్రపడ్డ వారితో టచ్‌లో ఉంటూ వారు బాలినేని వెంట వెళ్లకుండా చూసుకుంటుంది. అయితే బాలినేనితో రాబోయే సమస్యలను ముందుగానే అంచనా వేసిన బూచేపల్లి తమ జెడ్పీటీసీ సభ్యులెవ్వరూ బాలినేనికి మగ్గకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

బాలినేని జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయన అనుచరులుగా ముద్ర పడ్డ పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలోకి వెళ్లారే తప్ప జిల్లాలోని వైసీపీకి చెందిన ద్విత్రియ, తృతియ శ్రేణి నేతలెవ్వరూ బాలినేని వెంట వెళ్లలేదు. ఇదే అంశానిని వైసీపీ క్యాడర్ ప్రజలలోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.

ప్రకాశం జిల్లా జెడ్పీ పీఠం నుంచి వైసీపీని దించి వేస్తానంటూ బాలినినేని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయనంత సీన్ లేందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

బాలినేని వ్యాఖ్యలపై జడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్పందించారు. దమ్మంటే జిల్లా పరిషత్ కుర్చిని టచ్ చేయమంటూ సవాల్ విసిరారు. దీంతో బాలినేని, వైసీపీల మధ్య జడ్పీ వార్ ఓ రేంజ్‌లో రగులుతుంది. రాజకీయ అవసరాల కోసం పార్టీ మారిన బాలినేని పవన్ మొప్పు పొందేందుకు ఇలాంటి ప్రగల్బాలు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు.

దీంతో ఒక్కసారిగా జిల్లాలోని వైసీపీలో ఆగ్రహజ్వాలు రగులుకున్నాయ్. జగన్ పై మాట్లాడినందుకే ఒకపక్క ఫ్యాను పార్టీ నేతలు నిప్పలగుండంలా రగిలిపోతుంటే, మళ్లీ జడ్పీ పీఠం గురించి మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలినేని పై బ్లాస్ట్ అయ్యారు. వరుస ప్రెస్ మీటులతో బాలినేనిపై మాటల తూటాలతో దాడి మొదలు పెట్టారు.

అయితే.. బాలినేని స్థానిక సంస్థలను పూర్తిగా కూటమి పార్టీలు కైవసం చేసుకునేలా వైసీపీ నుంచి జనసేన లోకి ఎలా చేర్చుకోవాలనే పవన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా, మండల పరిషత్ కాలపరిమితి 4ఏళ్లు పూర్తవడంతో అవిశ్వాస తీర్మాణంతో తోలగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బాలినేని జడ్పీ పీఠం గురించి మాట్లాడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

బాలినేని అన్నట్లు జనసేనకు జడ్పీ పీఠం దక్కాలంటే సగానికి పైగా వైసీపీ సభ్యులు జనసేనలోకి చేరాలి. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఇదంతా ఈజీ అయ్యే పని కాదనేది రాజకీయ విశ్లేషకులు అంచనా. ముఖ్యంగా టీడీపీ సపోర్ట్ లేకుండా ఇది జరగని పని టీడీపీ నాయకుల సపోర్ట్ లేకుండా బాలినేని ఈ విషయంలో అడుగు ముందుకు వెయ్యలేరనేది రెండు పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే జిల్లాలోని టీడీపీ క్యాడర్, బాలినేని, జనసేన పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోతుంది.

పైగా బూచేపల్లి కుటుంబంపై జిల్లా రాజకీయ పార్టీలో సాప్ట్ కార్నార్ కూడా ఉంది. జడ్పీ కాల పరిమితి కేవంలం ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పుడంతా రిస్క్ చేసి వైసీపీ జడ్పీ టీసీలు బాలినేని దగ్గరకు వెళ్తారా అన్న సందేహాలు కూడా తలెత్తుున్నాయి.

జనసేన ఆవిర్భావ సభలో బాలినేని ఆవేశంగా ఆ మాటైతే అన్నారు. కానీ ఆచరణలో అతి అంత సాధ్యం కాదన్న చర్చ జరగుుతుంది. అయితే బాలినేని చెప్పినంత పని చేస్తాడా లేక బూచేపల్లి ఉడాది పాటు తన పట్టు నిలుపుకుంటారో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button