తెలంగాణ
Revanth Reddy: నాంపల్లి స్పెషల్ కోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: నాంపల్లి స్పెషల్ కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గతంలో తనపైన నమోదయిన వివిధ కేసులపై స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో నల్గొండతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక బహిరంగ సభల్లోహేట్ స్పీచ్ లపై ప్రస్తుత రేవంత్ పై తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి.
మాజీ ముఖ్యమంత్రిని దూషించడంతో పాటు అనేక సందర్భాల్లో హేట్ స్పీచ్ లు ఇచ్చారని కేసులు నమోదయ్యాయి. కోర్టు ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని తెలుపడంతో సీఎం రేవంత్ నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు.



