అంతర్జాతీయం
Trump: భారత్ దగ్గర చాలా డబ్బు ఉంది.. మేం ఎందుకు ఇవ్వాలి

Trump: అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో అనవసర వ్యయ కట్టడి కోసం రూపొందించిన డోజ్ విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21మిలియన్ డాలర్ల ఫండ్‌ను రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించడం ఇప్పుడు చర్చనీయాంశ మైంది. అంతేకాదు.. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు ఇవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు.
అసలు భారత్‌కు ఎందుకు డబ్బు ఇవ్వాలి..? ఇండియాతోనే చాలా డబ్బు ఉందంటున్నారు ట్రంప్. అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. ఇండియా విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువేనంటున్నారు. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను చేరుకోలేదని చెబుతున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్, నేపాల్‌కు కేటాయించిన ఫండ్‌ను కూడా రద్దు చేసింది డోజ్ విభాగం.



