తెలంగాణ
Seethakka: రాహుల్పై బండి విమర్శలకు సీతక్క కౌంటర్

Seethakka: రాహుల్ గాంధీపై బండి సంజయ్ చేసిన విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ వేశారు. రాహుల్ గాంధీ మతం-అభిమతం కులగణన అని చెప్పారు. కులగణన అంశం పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీ మతం, కులంపై కామెంట్లు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలతో పదవులు పొందటం బీజేపీ నేతల నైజమంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రేమ, శాంతి, సమానత్వం కోసమే రాహుల్ గాంధీ పని చేస్తున్నారని సీతక్క వివరించారు.