Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్ట్ చేశా రు. ప్రధానంగా గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. టీడీపీ ఆఫీస్‌లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్‌ను.. బెదిరించి, దాడి చేసిన కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. నాటి ఘటనపై టీడీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే
రెండ్రోజుల క్రితం సడన్‌గా కేసు వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. వంశీ బెదిరింపులతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పడమట పోలీసుల విచారణ జరుపుతున్నారు.
ఇక టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఏ71గా వంశీ ఉన్నాడు. అయితే ఇదే కేసులో ఇప్పటికే వంశీ సహా 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఇదే కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈలోపే కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. ఇక వంశీపై BNS సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.