టాలీవుడ్
Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. ఫొటో షేర్ చేసిన హీరో

Kiran Abbavaram: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. తన భార్య రహస్య గోరక్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆయన “మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది” అని ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తన మొదటి చిత్రం ‘రాజావారు రాణివారు’లో నటించిన హీరోయిన్ రహస్యను కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . గతేడాది ఆగస్టులో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. గత ఏడాది ‘క’తో కిరణ్ అబ్బవరం సూపర్‌హిట్‌ను అందుకున్నారు.
https://x.com/Kiran_Abbavaram/status/1881552965947040041/photo/1