తెలంగాణ
Adilabad: వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. నార్నూర్ మండలం పిప్పిరిలో సైతం నలుగురు వ్యవసాయ కూలీలపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు.
వ్యవసాయ కూలీ పనుల కోసం బేల మండలంలో వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళలు వర్షంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగులు పడడంతో ఇద్దరు మృతి చెందారు. పిడుగులు పడి ఆరుగురు మృతి చెందడంతో జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.