తెలంగాణ
జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ

ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలని సీఎం కోరారు.
పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు.



