ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో టీటీడీ మాజీ ఈవో సాంబశివరావు, మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, తెలంగాణ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, సినీనటుడు నవీన్ చంద్ర వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ప్రముఖులకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.



