ఆంధ్ర ప్రదేశ్
మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఎఫ్.కె.పాలెంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ముందుగా మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానికంగా చేపట్టనున్న 11 చెరువుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. చెరువుల అభివృద్ధితో సాగునీరు, తాగునీటి అవసరాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఎఫ్.కె.పాలెంలో స్థానికులను పవన్ కళ్యాణ్ స్వయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తమ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.



