News

Donald Trump: హర్మూజ్‌ ఇక మా భూభాగమే

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ అమెరికా భూభాగమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఒక మ్యాప్‌ పోస్ట్‌ చేశారు. ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రణాళికేమీ తమ వద్ద లేదని ట్రంప్‌ తెలిపారు.

హర్మూజ్‌లో నౌకపై దాడి జరిగినప్పటికీ పరిమితస్థాయిలో రాకపోకలున్నాయని, జలసంధి తెరిచే ఉందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో తమ దిగ్బంధనాన్ని పూర్తిస్థాయిలో, ప్రభావవంతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. సముద్ర జలాల్లోని మందుపాతరలు అన్నింటినీ తొలగించినట్లు వెల్లడించారు.

ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ తోసిపుచ్చింది. ఇదంతా ట్రంప్‌ భ్రమేనంటూ ఇరాన్‌ విదేశాంగశాఖ ఉపమంత్రి కజెమ్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ డిమాండ్లను అంగీకరించే వరకూ హర్మూజ్‌ మూసివేత కొనసాగుతుందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button