ఆంధ్ర ప్రదేశ్
ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభం

విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మక భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1న జరగనున్న ప్రారంభ కార్యక్రమానికి అబ్జర్వర్‌గా వచ్చిన మంత్రి దేవినేని ఉమా.. చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో పార్టీ మండల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం ఎయిర్‌పోర్టుపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.
ఎయిర్‌పోర్టులో ఎర్రబస్సు కూడా తిరగదన్న వ్యాఖ్యలు ఇప్పుడు తప్పని నిరూపితమవుతున్నాయని అన్నారు. చంద్రబాబు హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై జగన్ చేసిన విమర్శలు తిరిగి ఆయనకే వర్తిస్తున్నాయని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. పట్టిసీమ, భోగాపురం ఎయిర్‌పోర్టు వంటి ప్రాజెక్టులు పూర్తికావని ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.



