సినిమా
Samantha: ఆ నొప్పులు సరదాగా ఉంటాయి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తనకు సంతోషం కలిగినా, బాధ కలిగినా.. ప్రతీ విషయాన్ని ఆమె తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలానే తాజాగా సమంత సోషల్ మీడియాలో పోస్టు చేసింది.ఇటీవల తాను చికెన్ గున్యా వ్యాధి బారిన పడినట్లు సమంత తెలిపింది.
అయితే ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను సమంత్ షేర్ చేసింది. చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పులు నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటుందంటూ ఆ బ్యూటీ రాసుకొచ్చారు. సమంత త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.