నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం !

ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ భేటీకి ఐదుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. అనారోగ్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లారు. సౌత్ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఇక టీజీ భరత్ అమెరికా పర్యటనలో నిమ్మల రామానాయుడు బెంగళూరు పర్యటనలో ఉన్నారు. కేంద్రమంత్రి తిరుపతి పర్యటనతో కొండపల్లి శ్రీనివాస్ కేబినెట్ భేటీకి హాజరుకాలేకపోయారు.
55 అంశాలపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చ జరుగుతోంది. పర్యాటక రంగంలో భారీ మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భారీ సంగీత కచేరీలు, ఈవెంట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టూరిజం ప్రమోషన్‌కు 50 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
నెల్లూరులో ఐటీసీ బ్రాండ్‌తో 4 స్టార్ హోటల్, వైఎస్సార్ కడప జిల్లాలో 3 స్టార్ హోటల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుప్పంలో ఫీడర్ ఛానళ్లు, రిజర్వాయర్ నిర్మాణం11 వందల 37 కోట్లతో ఉడ్ ప్యానెల్ తయారీ ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.



