తెలంగాణ
మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకాయి. దీంతో ఎండల తీవ్రతకు చెక్ పడనుండగా, పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి… మరో రెండు,, మూడు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ అంతటా మరింత విస్తరించనున్నాయి.
రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. .



