ఆంధ్ర ప్రదేశ్
ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

ఎన్టీఆర్ జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, బస్సును వెంటనే రోడ్డు పక్కకు నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. బస్సు ఆగిన వెంటనే ప్రాణభయంతో ప్రయాణికులు కొందరు తలుపుల గుండా కిందికి దిగగా.. మరికొందరు కిటికీల నుంచి దూకేశారు. డ్రైవర్ అప్రమత్తత వల్ల బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు



