తెలంగాణ
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతుండగా.. ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, రాయదుర్గం ఏరియాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అటు హైదర్గూడ, ఉప్పరపల్లి వాటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదువుతోంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని గంటల పాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.



