ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు..పవన్ అన్న నాకు అండగా ఉన్నారు

Nara Lokesh: టీడీపీ మహానాడులో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మహానాడు అంటేనే ఒక మాస్ జాతర అని నారా లోకేష్ అన్నారు.

చంద్రబాబు ఇప్పటికీ ‘జెడ్ స్పీడ్’తో పని చేస్తున్నారని కొనియాడారు.ఇక గత ఐదేళ్ల కష్టాలను గుర్తుచేసుకుంటూ.. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు “పవన్ అన్న నాకు కొండంత అండగా నిలిచారు” అంటూ లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే విశాఖ ఉక్కు సురక్షితంగా ఉందన్న ఆయన.. అటు ఏపీలోనే కాకుండా, ఇటు తెలంగాణలోనూ టీడీపీ బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button