తెలంగాణ
మాసబ్‌ట్యాంక్‌లో న్యాయవాదిని కారుతో ఢీకొట్టి దారుణ హత్య..

హైదరాబాద్‌లో లాయర్ ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. మాసబ్ ట్యాంక్‌లో మొయినుద్దీన్ ఇంటి నుంచి బయటకు రాగానే దుండగులు కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన మొయినుద్దీన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్‌లతో మొయినుద్దీన్‌కు వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.



