News
TVK ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి హైకోర్టు షాక్

తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపటి బలపరీక్షలో పాల్గొనకూడదని ఆదేశించింది. ఒక్క ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి గెలిచారు. అయితే పోస్టల్ బ్యాలెట్‌లో అక్రమాలు జరిగాయని డీఎంకే నేత పెరియకరుప్పన్ పిటిషన్ వేశారు.
పిటిషన్ విచారించిన హైకోర్టు.. శ్రీనివాస సేతుపతి బలపరీక్షలో పాల్గొనకూడదని ఆదేశించింది. ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటింగ్ వివరాలు కోర్టుకు అందజేయాలని ఆదేశించింది.



