జాతియం
ప్రధాని మోడీ వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ కౌంటర్

ప్రధాని మోడీ వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు త్యాగాలు చేయాలని ప్రధాని మోడీ అనడం.. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. 12 ఏళ్లలో దేశాన్ని మోడీ ఎంతగానో దిగజార్చారని మండిపడ్డారు. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లకూడదో చెప్పేస్థితికి తెచ్చారని విమర్శించారు. ప్రతిసారి ప్రజలపై బాధ్యత నెట్టివేసి.. తమ జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు.



