తెలంగాణ
హైదరాబాద్ లో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద బారులుతీరిన వాహనదారులు

హైదరాబాద్‌లో పెట్రో కొరత సెగలు రేపుతోంది. ఇంధన నిల్వలపై వస్తున్న వదంతులు.. నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టమైన ప్రకటన విడుదల చేసినప్పటికీ.. గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. నగరంలోని బంకుల దగ్గర కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూ కడుతున్నారు.



