తెలంగాణ
KTR: నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా మన బీఆర్ఎస్ జెండా

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా మన గులాబీ జెండా అంటూ పాతికేళ్ల ఈ సుదీర్ఘ ప్రస్థానం కేవలం రాజకీయ ప్రయాణం కాదని, అది ఒక విప్లవమని కేటీఆర్ అభివర్ణించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే లక్ష్యంగా సాగిన ఈ మహోజ్వల ప్రయాణం నేడు సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలకు చేరుకుందన్నారు.



