తృటిలో తప్పిన ప్రాణాపాయం.. నిర్మల్ జిల్లా వాసి అదృష్టం

ఆ కంపెనీ నిర్ణయం అతన్ని కాపాడింది. ఇరాక్ యుద్ధ మేఘాల మధ్య చావును అంచుల వరకు చూసి, క్షేమంగా సొంత గడ్డపై అడుగుపెట్టాడు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ కార్మికుడు. అతను ఇంటికి చేరిన మరుసటి రోజే.. తను పని చేసిన కంపెనీపై బాంబుల వర్షం కురిసింది. ఒక్క రోజు అటు ఇటు అయినా కథ అడ్డం తిరిగేది. అడుగు పెట్టిన మరుసటి రోజే తను పనిచేసే కంపెనీపై బాంబు దాడి జరిగింది. ఈ షాకింగ్ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
కుంటాల గ్రామానికి చెందిన హన్మండ్లు గత 14 ఏళ్లుగా ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లోని ఓ క్యాంప్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. యుద్ధం తీవ్రమవ్వడంతో కంపెనీ పంపిన విడతల్లో భాగంగా ఈనెల 4న హన్మండ్లు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. అయితే, ఆయన వచ్చిన మరుసటి రోజే ఆ కంపెనీపై డ్రోన్ దాడి జరగడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



