News

చెస్ లో మంత్రి కొండా సురేఖ మనవడి ప్రతిభ.. 2 ఏళ్ల వయసులో రెండు ప్రపంచ రికార్డులు

జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ అపూర్వ పోటీలు నిర్వహించారు. కేవలం 2 సంవత్సరాల 11 నెలల వయసున్న కొండా శ్రేయాన్ష్.. కళ్లు చెదిరే వేగంతో రెండు వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 15 నిమిషాల 52 సెకన్లలోనే 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, ఒక గంట 9 నిమిషాల 9 సెకన్లలో 21 చెస్ బోర్డులను పకడ్బందీగా అమర్చి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.

శ్రేయాన్ష్ అపార మేధస్సును చూసి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వాకిటి శ్రీహరి అబ్బురపోయారు. ఈ బాలుడు భరతమాత ముద్దు బిడ్డ అని, స్వామి వివేకానందుని మేధస్సును పుణికిపుచ్చుకున్నాడని ప్రశంసించారు. తన మనవడు ప్రపంచ వేదికపై మెరవడంతో మంత్రి కొండా సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు. శ్రేయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ మరియు మంత్రి సురేఖ ఆనందబాష్పాలు రాల్చారు. అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన శ్రేయాన్ష్‌ను చూసి అకాడమీ ప్రతినిధులతో పాటు క్రీడాభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button