సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాకాస చిత్ర బృందం

Tirumala: రాకాస చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో రాకాస చిత్ర నిర్మాత నిహారిక కొణిదల, నటుడు సంగీత్ శోభన్, నటి నయన్ సారిక లు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. టీటీడీ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన చిత్ర బృందం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు. శ్రీవారి దర్శనం ఎప్పుడూ చాలా అద్భుతంగా జరుగుతుందని నిర్మాత నిహారిక అన్నారు. మా చిత్రం చాలా బాగా ఆడుతుందని, చిత్రం విడుదలై మూడు రోజులు అవుతున్న కుటుంబంతో కలిసి పిల్లలు కూడా చిత్రానికి వెళుతున్నారన్నారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనంలో గాయకుడు మను శ్రీవారిని దర్శించుకున్నారు..



