తెలంగాణ

కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా

రాజీనామా సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ గుర్తింపు లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు పోరాటం కొత్త కాదని చంద్రబాబు, కేసీఆర్‌తో పోరాడానని తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో పోరాడుతానన్నారు జీవన్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. బండారి గార్డెన్స్‌లో అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశం అయ్యారు. అభిమానులు, కార్యకర్తల సమక్షంలో రాజీనామా ప్రకటన చేశారు. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button