కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వ హయంలోనే భయపడలేదు”_ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

Dhulipalla Narendra: పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద కుటుంబ సమేతంగా పడ్డ బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం
ఊసరవెల్లిల ఉడత ఊపులకు భయపడేవాడు లేడు.
రాజధాని అంశంలో ఆరోపణలు చేసినపుడే ‘ఏమీ పీకలేరు’ అని చెప్పా, ఈరోజు కూడా అదే చెప్తున్నా.
బందరు ఊసరవెల్లికి భయపడి నేను రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసాననడం హాస్యమే.
వెబ్సైట్లు డౌన్ చేయటం, మార్పింగ్ చేయటం అంత ఖర్మ మాకు పట్టలేదు — మావి ఫేక్ బ్రతుకులు కావు.
భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్లతో 3 టన్నులకు పైగా సిమెంట్‌ను కనిపించారు.
వైసిపి పెట్టిన 22 కేసులు ఇప్పటికీ నా మీదున్నాయి, ప్రభుత్వం నాకు సహకరిస్తే ఆ తప్పుడు కేసులు ఎత్తేయాలి కదా??
వైష్ణవి పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎందుకు వచ్చిందో — నా మీద కుట్ర చేసి మీతో చేతులు కలిపి కేసులు పెట్టించిన మాజీ చైర్మన్‌ను అడగండి.
ఫేక్ బతుకులకు పేటెంట్ హక్కులు వైసిపివి — మీవి ఫాల్త్ గాళ్ళు వైసీపీ వాళ్ళు.
తిరుపతి లడ్డు అయిందనేది నిజం, వెజిటబుల్ & జంతువుల కొవ్వు ఉందని NDDB చెప్పింది. వైసిపి వాళ్ళు స్వామి దగ్గరకు వెళ్ళి తప్పు ఒప్పుకోవాలి స్వామి.
కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము విజయవాడకి 12.5 కోట్లు, చెన్నైకి 7.5 కోట్లు వచ్చాయని సిట్ చెప్పింది.
వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేస్తే ఎవరైనా మట్టిలో కలిసిపోవడం ఖాయం.
సంగం డెయిరీ 2020, 2021లో కూడా టీటీడీ నెయ్యి టెండర్ వేసింది.
ఆ దేవ దేవుడి దగ్గర సేవ చేయడానికి ఎన్నో సంవత్సరాల నుండి సంగం డెయిరీ ఎదురు చూసింది స్వామి — ఇప్పుడు అవకాశం ఇచ్చారు.
చంద్రబాబు గారు చెపితే టెండర్ ఇవ్వలేదు, టెండర్లో పాల్గొని నెయ్యి సరఫరా చేస్తున్నాం.
హెరిటేజ్ ఒక్క నెయ్యి పూస కూడా టీటీడీకి సరఫరా చేయలేదు.



