కృతి సనన్‌కు ఉత్తమ నటి అవార్డ్.. నెటిజన్ల ఆగ్రహం!

Kriti Sanon: జీ సినీ అవార్డ్స్ 2026లో ఉత్తమ నటి అవార్డు కృతి సనన్‌కు దక్కింది. కానీ ఈ ఎంపికపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంగనా రనౌత్, యామీ గౌతమ్‌లను పక్కన పెట్టి కృతికి అవార్డు ఇవ్వడం సరికాదని వాదనలు వస్తున్నాయి. అవార్డుల నిజాయితీపై నమ్మకం తగ్గుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటనకు గాను కృతి సనన్ జీ సినీ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అయితే ఈ ఎంపికపై సోషల్ మీడియాలో భారీ విమర్శలు మొదలయ్యాయి. కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’లో ఇందిరా గాంధీ పాత్రతో అద్భుతం చేశారని యామీ గౌతమ్ ‘హక్’లో అద్భుత నటనతో మెప్పించారని నెటిజన్లు అంటున్నారు.
వీరిద్దరినీ పక్కన పెట్టి కృతికి అవార్డు ఇవ్వడం వేడుకకు హాజరైన వారికే బహుమతులు ఇచ్చే సంప్రదాయమని సెటైర్లు వేస్తున్నారు. కృతి నటన బాగున్నా ఉత్తమ నటి స్థాయికి చేరలేదని.. చిరాకు తెప్పించిందని కామెంట్లు వస్తున్నాయి. త్రిప్తి డిమ్రి పేరును కూడా ప్రస్తావిస్తున్నారు. అవార్డుల్లో పారదర్శకత, నటనకు ప్రాధాన్యత ఉండాలని సినీ ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.



