చిన్నారి ప్రాణాలు కాపాడిన శృతి హాసన్!

Sruthi Haasan: టాలెంటెడ్ నటి శృతి హాసన్ తన స్టార్‌డమ్‌ను సమాజ సేవకు ఉపయోగించి అద్భుతం చేసింది. అరుదైన జన్యు వ్యాధి MSMDతో బాధపడుతున్న చిన్నారి ఆళ్వి ప్రాణాలను కాపాడేందుకు ఆర్థికంగా, మానసికంగా, వైద్యపరంగా పూర్తి సహకారం అందించింది. ఐసీయూలో ఉన్న పాపను బ్రతికించింది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
పుట్టుకతోనే MSMD అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఆళ్వికి గతేడాది ఎముక మజ్జ మార్పిడి చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో శృతి హాసన్ ఆ పాప కుటుంబానికి దేవతలా అండగా నిలిచింది. కేవలం డబ్బు ఇచ్చి సరిపెట్టకుండా స్వయంగా ముందుకు వచ్చి డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి నిపుణులతో మాట్లాడి ఉత్తమ చికిత్స అందేలా చూసింది.
ఆర్థిక సహాయంతో పాటు మానసిక ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆళ్వి ఆరోగ్యంగా ఉంది. ఇటీవల శృతిని కలిసినప్పుడు ఆ పాపతో ఆడుకుంటున్న వీడియో హృదయాన్ని తాకుతుంది. శృతి ఆ చిన్నారికి బిస్కెట్లు తెచ్చి సొంత ఇంటి పిల్లలా ఆదరించింది. శృతి మానవత్వం ఆమెను మరింత గౌరవనీయురాలిని చేసింది.



