పెళ్లి తరువాత సమంత సంచలన నిర్ణయం?

Samantha: సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 1న వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సమంత సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
సమంత రుతు ప్రభు.. ఈ పేరుకి స్పెషల్ క్రేజ్ ఉంది. అయితే రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత సామ్ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతోంది. ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారు. ప్రొఫెషనల్‌గా కూడా జత కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత నటిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా ఉన్నారు. సమంత తన బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.
తాజాగా సమంత తన పేరును ‘సమంత నిడిమోరు’గా మార్చుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు వ్యాప్తి చెందాయి. ఈ కొత్త పేరును ‘మా ఇంటి బంగారం’ టైటిల్ కార్డ్స్‌లో చూడవచ్చని అంటున్నారు. ఇది అధికారికంగా జరిగితే సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అవుతుంది. అభిమానులు ఈ మార్పుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



