ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్న నారా లోకేశ్ దంపతులు

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి షిర్డీలోసాయినాథుడ్ని దర్శించుకున్నారు. కాగడ హారతి, ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు లోకేశ్ దంపతులకు స్వాగతం పలికి సత్కరించారు. హారతి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.



