సినిమా
సెన్సార్ బోర్డుపై రామ్ గోపాల్ వర్మ ఫైర్!

Ram Gopal Varma: విజయ్ చివరి సినిమా జన నాయగన్ సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. రిలీజ్ ఆలస్యమవుతోంది. ఈ విషయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. సెన్సార్ బోర్డు అవసరం లేదని అన్నారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
విజయ్ నటించిన జన నాయగన్ సినిమా సెన్సార్ ఇష్యూతో ఆలస్యమవుతోంది. ఈ వివాదంపై రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. డిజిటల్ యుగంలో అన్‌రెస్ట్రిక్టెడ్ కంటెంట్ ఫ్రీగా తిరుగుతుంటే సినిమాలకు మాత్రం సెన్సార్ ఎందుకని ప్రశ్నించారు.
కట్స్ కాకుండా ఏజ్ రేటింగ్స్, వార్నింగ్స్ చాలని, ఇది ఎక్స్‌ప్రెషన్ ఫ్రీడమ్‌కు వ్యతిరేకమని అన్నారు. ఈ వివాదం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఇది ఆయన చివరి సినిమాగా రాబోతోంది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



